: జయకు మద్దతుగా తమిళ చలనచిత్ర రంగం నిరాహారదీక్ష ప్రారంభం
అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని జైలులో శిక్ష అనుభవిస్తున్న జయలలితకు మద్దతుగా తమిళ చలనచిత్ర రంగం చేపట్టిన నిరాహార దీక్ష ప్రారంభమయింది. ఈ దీక్షలో పలువులు ప్రముఖ నటీనటులు, నిర్మాతలు, దర్శకులతో పాటు ఇండస్ట్రీకి చెందన పలువురు పాల్గొన్నారు. దీనికితోడు, ఈరోజు తమిళనాడు వ్యాప్తంగా సినిమా థియేటర్లను బంద్ చేశారు.