: 2018 క్రీడల్లో మహిళా జట్టుకు మార్గ నిర్దేశకురాలిగా వ్యవహరిస్తా: సానియామీర్జా


కెరీర్ లో భారత్ కు సాధ్యమైనన్ని విజయాలను అందించడమే తన లక్ష్యమని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపింది. ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో సాకేత్ తో కలసి మిక్స్ డ్ డబుల్స్ లో స్వర్ణ పతకం సాధించిన అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ క్రీడల్లో ఆడాలనే నిర్ణయాన్ని చివరి క్షణాల్లో తీసుకున్నానని... అదే సరైన నిర్ణయమని చెప్పింది. భారత బృందం అత్యుత్తమ ఆటగాళ్లతో ఆసియాడ్ కు రానప్పటికీ... యువ క్రీడాకారులతోనే పతకాల నెగ్గడం శుభపరిణామమని తెలిపింది. 2018 క్రీడల్లో మహిళా జట్టుకు మార్గ నిర్దేశకురాలిగా వ్యవహరిస్తానని చెప్పింది.

  • Loading...

More Telugu News