: చైనాలో ఐఫోన్ 6 ధర రూ.1.5 లక్షలు!


యాపిల్ తాజా సంచలనం ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ మోడళ్లు ఇంకా వినియోగదారులకు పూర్తిగా అందుబాటులోకే రాలేదు. అప్పుడే సదరు మోడళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. స్మగుల్డ్ గూడ్స్ కు కేంద్రంగా పరిగణిస్తున్న చైనాలో ఇప్పటికే పలు చోట్ల ఐఫోన్ 6, 6 ప్లస్ లు లభ్యమవుతున్నాయి. అయితే, ధర మాత్రం భారీగా ఉందట. ఐఫోన్ 6 ను సొంతం చేసుకునేందుకు చైనీయులు ఏకంగా ఒక్కో ఐఫోన్ కోసం రూ.1.5 లక్షలు వెచ్చించేందుకు కూడా వెనుకాడటం లేదట. అమెరికాతో పాటు హాంకాంగ్, సింగపూర్ లలో ఈ నెల ప్రథమార్థంలోనే ఐఫోన్ 6 లు మార్కెట్ లోకి వచ్చాయి. అయితే చైనాలో ఇంకా రంగ ప్రవేశం చేయలేదు. హాంకాంగ్ నుంచి చైనాలోకి అక్రమ మార్గాల్లో చేరుతున్న ఐఫోన్ 6 లకు భారీ డిమాండ్ లభిస్తున్న వైనంపై యాపిల్ స్పందించేందుకు నిరాకరించింది.

  • Loading...

More Telugu News