: బెంగళూరులో క్రికెట్ బెట్టింగ్ రాకెట్ గుట్టురట్టు


పశ్చిమ ఆసియా దేశాల బెట్టింగ్ రాకెట్లతో సంబంధాలు ఉన్నాయని భావిస్తున్న ఓ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ ను బెంగళూరు పోలీసులు ఛేదించారు. ఈ క్రమంలో సూరజ్, బల్ రాజ్, అనిల్ కుమార్, నజీర్ అనే వ్యక్తులను అరెస్టు చేశారు. సుల్తాన్ పాళ్య ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంటులో ఉండగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.23 లక్షల నగదు, 24 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద ఓ క్యాష్ కౌంటింగ్ యంత్రం కూడా లభ్యమైంది. సూరజ్ నేతృత్వంలోని ఈ బెట్టింగ్ రాకెట్, దుబాయ్ తదితర దేశాల్లోని పందెపురాయుళ్ళతో సంప్రదింపులు జరుపుతుండేదని, వారి ఫోన్ కాల్ రికార్డులను పరిశీలించగా తేలింది. హవాలా మార్గంలో బెట్టింగ్ కు సంబంధించిన చెల్లింపులు జరిగేవని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేగాకుండా, భారత్ వేదికగా జరుగుతున్న చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ మ్యాచ్ లపైనా వీరు బెట్టింగ్ కు పాల్పడ్డారేమోనన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. విచారణ సందర్భంగా తమకు అంతర్జాతీయ బెట్టింగ్ సిండికేట్ తో సంబంధాలున్నాయని సూరజ్ గ్యాంగ్ అంగీకరించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News