: 'అమ్మ' కోసం సినిమా డిస్ట్రిబ్యూటర్ల నిరాహార దీక్షలు


అన్నా డీఎంకే అధినేత్రి జైలుపాలవడంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. కొందరు తీవ్ర మనస్తాపానికి లోనై బలవన్మరణానికి పాల్పడ్డారు కూడా. రాష్ట్రంలోని వివిధ వర్గాలు ఇప్పుడు జయలలితకు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు సినిమా డిస్ట్రిబ్యూటర్ల సంఘం కూడా 'అమ్మ'కు మద్దతు తెలిపింది. సినీ పరిశ్రమకు జయలలిత ఎంతో మేలు చేశారని, అందుకే ఆమెకు తాము సంఘీభావం ప్రకటిస్తున్నామని సంఘం సభ్యుడొకరు పేర్కొన్నారు. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లు నిరాహారదీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. రేపు (మంగళవారం) తమిళనాడులోని అన్ని థియేటర్లలో షోలను రద్దు చేశారు.

  • Loading...

More Telugu News