: గూగుల్ ఇండియాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిజిటల్ నెట్ వర్క్ ను విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం గూగుల్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. చిన్న వ్యాపారులకు ఇంటర్నెట్ ద్వారా లబ్ది చేకూర్చేందుకు గూగుల్ సాయం చేయనుంది. విశాఖలోని రుషికొండ ఐటీ పార్కులో ఇంక్యుబేషన్ సెంటర్ ను ఈరోజు ప్రారంభించారు. ప్రస్తుతం విశాఖలోని నోవాటెల్ హోటల్లో ఐటీ పరిశ్రమ సీఈవోలు ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు.