: మోడీ కోసం ఆఫ్ఘన్ పర్యటన రద్దు చేసుకున్న జాన్ కెర్రీ


భారత ప్రధాని నరేంద్రమోడీకి అమెరికా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో, మోడీతో కలసి విందు సమావేశంలో పాల్గొనడానికి ఆ దేశ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఏకంగా ఆఫ్ఘనిస్థాన్ పర్యటననే రద్దు చేసుకున్నారు. ఈ రోజు ఆఫ్ఘన్ నూతన అధ్యక్షుడిగా అష్రఫ్ ఘనీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆఫ్ఘన్ రాజకీయ సంక్షోభం పరిష్కారంలో కీలక పాత్ర పోషించిన కెర్రీ... ఘనీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సి ఉంది. అయితే, మోడీ పర్యటనకు అమెరికా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో కెర్రీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News