: ఒకే వేదికపై జాకీ చాన్, కేసీఆర్, చిరు!


అవును, టాలీవుడ్ నిర్మాత ఎన్వీ ప్రసాద్ చేస్తున్న యత్నాలు ఫలిస్తే, అంతర్జాతీయ నటుడు జాకీ చాన్, మెగా స్టార్ చిరంజీవి, తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకే వేదికపై కనువిందు చేయనున్నారు. తమిళ నటుడు విక్రం, అమీ జాక్సన్ లు జంటగా ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందించిన ‘ఐ’ చిత్రం తెలుగు వెర్షన్ ఆడియో వేడుకలో ఈ అద్భుతం చోటుచేసుకోనుంది. వచ్చే నెలలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి హాజరు కావాలన్న తమ ఆహ్వానానికి జాకీ చాన్ నుంచి రెండు రోజుల్లోగా సానుకూల స్పందన రానుందని ‘ఐ’ తెలుగు వెర్షన్ నిర్మాత ఎన్వీ ప్రసాద్ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News