: జగన్ లాంటి ప్రతిపక్ష నేత ఉండటం దురదృష్టకరం: మంత్రి బొజ్జల
వైకాపా అధినేత జగన్ పై ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మండిపడ్డారు. జగన్ లాంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం దురదృష్టకరమని అన్నారు. శాసనసభలో ప్రశ్నలు వేయడం, సమాధానాలు వినకుండానే వాకౌట్ చేయడం వైకాపా పద్ధతి అని ఎద్దేవా చేశారు. ఇలాంటి ప్రతిపక్షం ఉండటం వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. ఎన్నో అక్రమాలకు పాల్పడ్డ జగన్ కు ఎన్నేళ్ల జైలు శిక్ష పడుతుందో కూడా తనకు అర్థం కావడం లేదని తెలిపారు. శిక్ష భయంతోనే జగన్ కూడా పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.