: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిపై కేసు నమోదు


తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో దోషిగా తేలిన జయలలిత ఉదంతం నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన అల్లర్లకు సంబంధించి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే సుప్రీం కరుణానిధి, ఆయన కుమారుడు, రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం స్టాలిన్ లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అక్రమాస్తుల కేసులో జయలలితను దోషిగా ప్రకటిస్తూ బెంగళూరు ప్రత్యేక కోర్టు శనివారం తీర్పుచెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే, డీఎంకే కార్యకర్తల మధ్య రాష్ట్రవ్యాప్తంగా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. గోపాలపురం సమీపంలో అన్నా డీఎంకే కార్యకర్తలపై జరిగిన దాడికి సంబంధించి కరుణానిధి, స్టాలిన్, 500 మంది డీఎంకే కార్యకర్తలపై కేసు నమోదైంది. ఐపీసీ 147, 148, 324, 336, 506 సెక్షన్ల కింద రాయపేట పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. అయితే డీఎంకే కార్యకర్తలపై జరిగిన దాడికి బాధ్యులుగా చేస్తూ అన్నా డీఎంకే నేతలు ఇళంగోవన్, గణేశన్ లపైనా పోలీసులు కేసులు పెట్టారు.

  • Loading...

More Telugu News