: పులి మాంసం కోసం రగడ!


శ్రీకాకుళం జిల్లాలోని సారవకోట మండలం బకిరికొండ వద్ద పులి మాంసం కోసం గ్రామస్తుల మధ్య రగడ చోటు చేసుకుంది. ఒడిశా అడవుల నుండి ఓ పులి ఉత్తరాంధ్రలో ప్రవేశించింది. రైవాడ కొండల్లో సంచరించడాన్ని స్థానికులు గుర్తించారు. కాగా, రైతులు ఏర్పాటు చేసిన కరెంటు కంచె కారణంగా ఆ పులి మరణించింది. దాన్ని కోసి మాంసాన్ని పంచుకోవాలని వారు నిర్ణయించారు. ఈ విషయంలో గ్రామస్తుల మధ్య విభేదాలు వచ్చాయి. వివాదం తీవ్రస్థాయికి చేరడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. అయితే, మాంసం సంగతి పక్కనబెట్టి పులి చర్మం, గోళ్ళు ఏం చేశారో చెప్పండంటూ పోలీసులు ప్రశ్నించడంతో వారు బిక్కచచ్చిపోయారు. ప్రస్తుతం గ్రామస్తులకు పోలీసులు తమ మార్కు కౌన్సిలింగ్ ఇస్తున్నారట.

  • Loading...

More Telugu News