: కాశ్మీర్ పై సమగ్ర విధానం: హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్


జమ్మూ కాశ్మీర్ పై సమగ్ర విధానాన్ని రూపొందిస్తున్నామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. త్వరలోనే ఈ విధానాన్ని ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు మధ్యవర్తుల నియామకంపై స్పందించిన ఆయన, ఆ తరహా ప్రతిపాదనేదీ లేదని స్పష్టం చేశారు. ఫలితాలివ్వని నియామకాలెందుకంటూ ఆయన ప్రశ్నించారు. అయితే, సమస్య పరిష్కారం దిశగా చర్చలకు తాము వ్యతిరేకం కాదని, ఫలితాలివ్వని చర్చల దిశగా ఆలోచించబోమని రాజ్ నాథ్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News