: జయలలితను కలిసేందుకు ఎమ్మెల్యేలకు అనుమతి నిరాకరణ


ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత జైలుపాలైన సంగతి తెలిసిందే. ప్రత్యేక న్యాయస్థానం నాలుగేళ్ళు జైలు శిక్ష విధించగా, పోలీసులు ఆమెను బెంగళూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ ఉదయం జయను కలిసేందుకు వచ్చిన పార్టీ ఎమ్మెల్యేలకు జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో, వారు నిరాశగా వెనుదిరిగారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ఎమ్మెల్యేలు చెన్నై చేరుకున్న తర్వాత, శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు సమావేశం కానున్నారు. అనంతరం తమ నిర్ణయాన్ని గవర్నర్ కు తెలుపుతారు.

  • Loading...

More Telugu News