: జయకు ప్రభుత్వ సౌకర్యాలన్నీ రద్దు చేయండి: మద్రాస్ హైకోర్టులో పిల్ దాఖలు


అక్రమాస్తుల కేసులో జైలు శిక్షకు గురైన జయలలితకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి హోదాలో జయలలితకు లభిస్తున్న ప్రభుత్వ సౌకర్యాలన్నీ రద్దు చేయాని కోరుతూ మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సామాజిక ఉద్యమకర్త 'ట్రాఫిక్' రంగస్వామి దాఖలు చేసిన ఈ పిల్ పై జస్టిస్ వైద్యనాథన్, జస్టిస్ మహదేవన్ లతో కూడిన మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ అత్యవసర విచారణకు అంగీకరించింది. నేటి మధ్యాహ్నం ఈ పిటిషన్ పై డివిజన్ బెంచ్ విచారణ చేపట్టనుంది. అవినీతి నిరోధక చట్టం కింద దోషిగా తేలిన జయలలితకు ఎలాంటి ప్రభుత్వ సౌకర్యాలు పొందే అర్హత లేదని, ఆమె మంత్రివర్గ సహచరులు కూడా ఆ అర్హత కోల్పోయారని రంగస్వామి తన పిటిషన్ లో పేర్కొన్నారు. జయలలిత అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న అల్లర్లను కూడా అణచివేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు.

  • Loading...

More Telugu News