: తమిళనాడులో బంద్ వాతావరణం
అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత జైలుపాలైన నేపథ్యంలో తమిళనాడులో ఆదివారం బంద్ వాతావరణం కనిపిస్తోంది. సేలం, మధురై తదితర ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. కాగా, నేడే అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. ఈ భేటీలో కొత్త శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు.