: నవంబర్ లో 'ఎన్టీఆర్ క్యాంటీన్లు' ప్రారంభం
'ఎన్టీఆర్ క్యాంటీన్లు' ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ లో ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. తొలి విడతగా విశాఖలో 10, తిరుపతిలో 5, అనంతపురంలో 5, గుంటూరులో 10 క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే వాటికి సంబంధించి పలుమార్లు చర్చలు, చెన్నైలో పరిశీలనలు జరిగాయన్నారు. కాగా ఏపీ మున్సిపల్ శాఖలో 2,240 మంది సిబ్బంది కొరత ఉందని మంత్రి చెప్పారు.