: మోడీ అమెరికా పర్యటనపై భారత్ లో 'సానుకూల దృక్పథం'


ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ తొలి అమెరికా పర్యటన భారత్, యూఎస్ దేశాల్లోని ప్రజలపై సుదీర్ఘ సానుకూల ప్రభావాన్ని ఏర్పరచినట్లు ఓ సర్వే పేర్కొంది. అంతేగాక, ఇరు దేశాల సంబంధాలకు ఈ పర్యటన ఎంతో ప్రయోజనం చేకూర్చుతుందని ప్రజలు భావిస్తున్నట్లు తెలిపింది. యూఎస్ పర్యటన అనగానే 'మాడిసన్ స్క్వేర్ గార్డెన్'లో మోడీ రిసెప్షన్ కోసం వేలాదిమంది ఎదురుచూస్తున్నారని, టికెట్లు కూడా తక్కువ వ్యవధిలోనే అమ్ముడుపోయాయని ప్యూ రీసెర్చ్ సెంటర్ అనలిస్ట్ ఒకరు చెప్పారు. దాదాపు 20వేల మంది భారత సంతతి అమెరికన్లు ఇందులో పాల్గొంటున్నారని, ప్రముఖ అమెరికన్ గాయకులు బ్రూస్ స్ప్రింగ్స్ టీన్, మడోన్నా, ఆర్కేడ్ ఫైర్ లతో సమానంగా ఈ కార్యక్రమానికి పాప్యులారిటీ వచ్చిందని చెబుతున్నారు. ఈ క్రమంలో భారత్ లో మెజారిటీ వర్గం (55 శాతం) అమెరికా పర్యటన పట్ల సానుకూలత వ్యక్తపరిస్తే, అందులో 30 శాతం మంది అత్యంత సానుకూల దృక్పథంతో ఉన్నారని సర్వే వెల్లడించింది. కేవలం 16 శాతం మందే ప్రతికూలంగా ఉన్నారని, 29 శాతం ఎలాంటి అభిప్రాయంతో లేరని సర్వే పేర్కొంది. ఈ సర్వేలో 65 శాతం మంది చదువుకున్నవారే యూఎస్ పట్ల సానుకూలతతో ఉన్నారని, తక్కువ విద్యావంతులు, మహిళలు అంత మంచి అభిప్రాయంతో లేరంటున్నారు. అదేగాక తక్కువ ఆదాయంగల (49) వారి కంటే అధిక ఆదాయంగల (57శాతం) వారే అమెరికా పట్ల మరింత అనుకూలంగా ఉన్నారని సర్వే వివరించింది.

  • Loading...

More Telugu News