: బుల్లితెర షో కోసం రూ.4 కోట్ల ఆభరణాలు!
తెలుగులో ప్రసారమవుతున్న ఓ షో కోసం రూ.4 కోట్ల బంగారు ఆభరణాలు ఉపయోగిస్తున్నారు. ఓ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ లో వస్తున్న ఈ కార్యక్రమానికి అనసూయ వ్యాఖ్యాతగా చేస్తోంది. దసరా పండుగ నేపథ్యంలో ప్రత్యేకంగా కొన్ని ఎపిసోడ్ లు తీస్తున్నారు. ఇందుకోసం ప్రతిదీ చాలా గ్రాండ్ గా ఉండాలని ఆలోచించి హైదరాబాదులోని ఓ జ్యువెలరీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వారే ఆ నగలను స్పాన్సర్ చేస్తున్నారట. "కేవలం బంగారు నగలు ధరించడమే కాకుండా, రాబోయే ఎపిసోడ్ లలో అనూసూయ పూర్తిగా సంప్రదాయ వస్త్రాల్లో, రిచ్ లుక్ తో కూడా కనిపిస్తుంది" అని షో దర్శకుడు అనిల్ కడియాల తెలిపారు. ఇటీవల విజయవాడ, గుంటూరు వెళ్లి షోలో పాల్గొనే వారిని సదరు టీమ్ వారు సెలక్ట్ చేశారట.