: పాక్ అణ్వాయుధాలు చిన్నవైనా...అత్యంత ప్రమాదకరమైనవే!


పాకిస్తాన్ అణ్వాయుధాల తయారీలో వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోందని అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని రాసింది. భారీ అణ్వస్త్రాలను కాకుండా తేలికపాటి అణ్వాయుధాలను రూపొందించుకునే కార్యక్రమాలకు ఆ దేశం శ్రీకారం చుట్టిందని ఆ పత్రిక కథనం చెబుతోంది. సముద్ర తలం మీద నుంచి అత్యంత సులువుగా ప్రయోగించేందుకు వీలుగానే పాక్, ఈ తరహా అణ్వాయుధాల రూపకల్పనకు సిద్ధపడుతున్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. పరిమాణంలో చిన్నవిగానే ఉన్నా, పాక్ తయారు చేసే అణ్వాయుధాలు భారీ విధ్వంసాన్ని సృష్టించేవేనని కూడా వాషింగ్టన్ పోస్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘భూ, గగన తలాల నుంచే కాక సముద్ర తలం నుంచి అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యం భారత్ కు ఉంది. భారత్ కు సరిసమానంగా తన అణ్వాయుధ సంపత్తిని, సామర్థ్యాన్ని పెంచుకునేందుకు పాక్ యత్నిస్తోంది’’ అని మిడిల్ ఈస్ట్ ఇన్ స్టిట్యూట్ లో పరిశోధకుడిగా కొనసాగుతున్న అరిఫ్ రఫిక్ చెప్పారు.

  • Loading...

More Telugu News