: 250 మంది పోలీసులతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అష్టదిగ్బంధనం


250 మంది పోలీసులతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలను అష్టదిగ్బంధనం చేశారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఇంట్లో ఉంటున్న ప్రతి వారి వివరాలు తెలుసుకున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో పోలీసులు కార్డ్ ఆన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సెర్చ్ సందర్భంగా 65 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఫిలింనగర్ లోని ఓ గెస్ట్ హౌస్ లోనూ, మరో మూడు చోట్ల పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదు నగరంలో నేరాలు అదుపులోకి వచ్చేవరకు కార్డ్ ఆన్ సెర్చ్ జరుగుతుందని డీసీపీ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News