: అంగారకుడిపై ట్రాఫిక్ సిగ్నల్స్!


గ్రహాంతర వాసుల ఉనికిపై ఎన్నో అనుమానాలు, మరెన్నో కథనాలు, అంతకు మించిన ఊహాగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీవం జాడ తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఇతర గ్రహాలపైకి ఉపగ్రహాలను పంపి పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా, అరుణ గ్రహం మీద ఉన్న క్యూరియాసిటీ రోవర్ పంపిన చిత్రాలు శాస్త్రవేత్తల్లో పలు అనుమానాలను రేకెత్తించాయి. అయితే, వాస్తవం రూఢీ చేసుకునేందుకు శాస్త్రవేత్తలు మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. క్యూరియాసిటీ రోవర్ పంపిన ఫొటోల్లో ఒక ఫొటో చూశాక ప్రపంచ శాస్త్రవేత్తలకు అంగారక గ్రహంపై ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయా? అనే అనుమానం కలిగింది. తాజాగా క్యూరియాసిటీ రోవర్ పంపిన చిత్రంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ను పోలిన ఆకారం ఒకటి కనిపించింది. దీంతో, నాసా శాస్త్రవేత్తలు దానిని క్షణ్ణంగా పరిశీలించే పనిలో పడ్డారు. బహుశా, అది రాయి కూడా కావచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News