: మీ సెల్ ఫోన్ ను ఇలా క్లీన్ చేసుకోండి!
నేటి కాలంలో సెల్ ఫోన్ ను వినియోగించని వ్యక్తి ఉండరంటే అతిశయోక్తి కాదు. కానీ, వాటి క్లీనింగ్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కాలక్రమంలో వాటిలో బ్యాక్టీరియా అభివృద్ధి చెంది అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చంటున్నారు నిపుణులు. ఆ సమస్య లేకుండా, ఇదిగో, ఇలా క్లీన్ చేసుకోండంటున్నారు. ఫోన్లను డిస్టిల్డ్ వాటర్ (కాచి చల్లార్చిన నీళ్ళు)తో గానీ, ఆల్కహాల్ తో గానీ శుభ్రపరచవచ్చట. దారపు పోగులు లేని సాఫ్ట్ క్లాత్ ను గానీ, క్యూ- టిప్ (ఇయర్ బడ్ లాంటి సాధనం) ను గానీ ఆల్కహాల్ లో ముంచి మృదువుగా కీబోర్డుపై రుద్దాలి. అయితే, బ్యాటరీ కింది భాగంలో శుభ్రం చేసేటప్పుడు పొడిగా ఉన్న క్యూ-టిప్ నే వాడాలి. ఇక, స్క్రీన్ ను క్లీన్ చేసేటప్పుడు సాఫ్ట్ క్లాత్ ను డిస్టిల్డ్ వాటర్ లో ముంచి సుతారంగా తుడవాలి. అయితే, లోహంతో తయారైన భాగాలను ఆల్కహాల్, డిస్టిల్డ్ వాటర్ తో శుభ్రపరచరాదట. అందుకు పొడి క్యూ-టిప్ నే వినియోగించాలంటున్నారు.