: పిల్లలకు కథలు ఎందుకు చెప్పాలంటే..?


'పూర్వం అనగనగా ఓ రాజు ఉండేవాడు...' అంటూ మన తాతయ్యోలో, నానమ్మలో ఎవరో ఒకరు చిన్నపిల్లల అల్లరి కట్టడి చేసేందుకో, వారికి అన్నం తినిపించడానికో, నిద్రపుచ్చడానికో కథలు చెబుతుంటారు. చిన్నారులు కూడా పెద్దలు చెప్పే కథలు వినడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. ఆ కథల్లో ఎన్నో రకాలు! రాక్షసుల కథల నుంచి, నవ్వు పుట్టించే కథల వరకు వాటిలో ఉంటాయి. పిల్లలకు ఈ కథల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. పిల్లలకు వీటి ద్వారా కొత్తకొత్త పదాలు పరిచయం చేయవచ్చు. ఏదైనా పదం వింతగా ధ్వనిస్తే, చిన్నారులు దాని అర్థం తెలుసుకునేందుకు ఉత్సుకత చూపుతారు, తద్వారా, ఓ పదం వారికి నేర్పించినట్టువుతుంది. కథల ద్వారా వినగలిగే సామర్థ్యం కూడా మెరుగువుతుంది. క్లాస్ రూంలో పిల్లలు ఎక్కువగా వినడం కన్నా మాట్లాడడానికే ప్రాధాన్యత ఇస్తారు. అందుకే, వారు మంచి శ్రోతలు కారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కథలు వినడాన్ని గనుక వారు అలవర్చుకుంటే, వారిలో వినడం ద్వారా విషయాలను అర్థం చేసుకునే సామర్థ్యం పెంపొందుతుంది. నేర్చుకునే నైపుణ్యం కూడా ఇతోధికంగా మెరుగవుతుంది. నేటి కాలంలో టీవీ చానళ్ళు, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ల కారణంగా పిల్లల్లో మానసిక అభివృద్ది కుంటుపడుతోందని, అయితే, కథలు వినడం ద్వారా వారిలో భావోద్వేగాలు, భావనలు అభివృద్ధి చెందుతాయనీ మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు.

  • Loading...

More Telugu News