: ‘మహా’ సీఎం రేసులో నితిన్ గడ్కరీ!


కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం రేసులో అందరికంటే ముందున్నారట. శివసేనతో పొత్తును తెగదెంపులు చేసుకున్న దరిమిలా, బీజేపీ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి విజయావకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయన్న ప్రచారమూ సాగుతోంది. దీంతో, నామినేషన్ల ఘట్టం కూడా ముగియకుండానే... అప్పుడే ఆ పార్టీలో సీఎం అభ్యర్థి ఎవరన్న ఊహాగానాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు పలువురు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి తామే సీఎం అభ్యర్థినంటూ ప్రచారం చేసుకుంటున్న నేతలు దాదాపు అరడజను మందికి పైగానే ఉన్నారని సమాచారం. వీరందరిలోకి గడ్కరీ కాస్త ముందు వరుసలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే గడ్కరీ కూడా అంత సులువుగా ఏమీ సీఎం పీఠం దక్కించుకునే అవకాశాలు కనిపించడం లేదని వైరివర్గాలతో పాటు స్వపక్షాలు కూడా వాదిస్తున్నాయి.

  • Loading...

More Telugu News