: కాంగ్రెస్ కి మద్దతు ఉపసంహరించుకుంటాం: అజిత్ పవార్


15 ఏళ్ల సుదీర్ఘ బంధం బద్దలు కావడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవానే కారణమని ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఆరోపించారు. సీట్ల సర్దుబాటులో విభేదాలకు కారణం ముఖ్యమంత్రి ఎన్సీపీని తక్కువగా అంచనా వేయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. గత సీఎంలు ఎన్సీపీకి ఇచ్చిన ప్రాధాన్యతను ప్రస్తుత సీఎం పృధ్వీరాజ్ చవాన్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. అందుకే తమ బంధం బద్దలైందని ఆయన స్పష్టం చేశారు. తాను డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయనున్నానని, గవర్నర్ విద్యాసాగరరావుకు రాజీనామా సమర్పిస్తానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News