: డైలమాలో ఏపీ రాజధాని కమిటీ!
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడను నిర్ణయించారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు, జమా, ఖర్చులు, నిర్మాణం, కేటాయింపులు తదితర అంశాల పరిశీలన, అమలుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడా కమిటీ డైలమాను తొలగించుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయింది. రాజధానికి అవసరమైన భూమిని రైతుల నుంచి సేకరించాలా? లేక ప్రభుత్వ భూమి సరిపోతుందా? అనేది ముఖ్యమంత్రితో కమిటీ చర్చించింది. భూమిని సేకరించాల్సి వస్తే విజయవాకు ఏ వైపుగా ఉన్న భూమిని సేకరించాలి? ఎంత భూమిని సేకరించాలి? అనే అంశాలను ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్నట్టు సమాచారం.