: ఏపీ ఎన్జీవో భవన్ లో టీఎన్జీవోల హల్ చల్... ఉద్రిక్తత


హైదరాబాదులోని ఏపీ ఎన్జీవో భవన్లో తెలంగాణ, ఏపీ ఎన్జీవోల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. అబిడ్స్ లోని ఏపీ ఎన్జీవో భవన్లో తెలంగాణ ఎన్జీవోలు బతుకమ్మ ఆడుతామంటూ హల్ చల్ చేశారు. వారి ప్రయత్నాన్ని ఏపీ ఎన్జీవోలు అడ్డుకున్నారు. భవన్ లోపలికి వచ్చి ఆడడం సరికాదని వారు హితవు పలికారు. తెలంగాణలో ఉంటూ ఏపీ ఏంటి? అంటూ వారు ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇది ఉమ్మడి రాజధాని అంటూ వారు దీటుగా సమాధానమిచ్చారు. దీంతో మండిపడిన టీఎన్జీవోలు, ఏపీ ఎన్జీవో భవన్ బోర్డును మార్చేందుకు ప్రయత్నించారు. ప్రతి సందర్భంలోనూ వివాదాలు సరికాదంటూ ఏపీ ఎన్జీవోలు హితవు చెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో టీఎన్జీవోలు దూషణకు దిగడంతో ఏపీ ఎన్జీవోలు భవన్ మెయిన్ గేటుకు తాళం వేసి వెళ్లిపోయారు. వారు వెళ్లిపోగానే తాళం పగులగొట్టేందుకు టీఎన్జీవోలు ప్రయత్నించారు. పోలీసులు వారించడంతో వారు తాళం పగులగొట్టే యత్నాన్ని విరమించారు.

  • Loading...

More Telugu News