: మిలిటెంట్ల ఆదాయ వనరులే లక్ష్యంగా బాంబు దాడులు
సిరియాలో ఐఎస్ఐఎస్ మిలిటెంట్లను అంతం చేసేందుకు అమెరికా చేపట్టిన వైమానికి దాడులు మూడో రోజుకు చేరుకున్నాయి. ఐఎస్ఐఎస్ మిలిటెంట్లకు మిలియన్ల రూపాయల ఆదాయం సమకూర్చుతున్న చమురు శుద్ధి కర్మాగారాలు లక్ష్యంగా అమెరికా దాడులకు పాల్పడుతోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 15 మంది మిలిటెంట్లు, ఐదుగురు సాధారణ పౌరులు మరణించినట్టు సమాచారం. సిరియా, ఇరాక్ లో ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు స్వాధీనంలోకి తీసుకున్న చమురు శుద్ధి కర్మాగారాల వల్ల రోజుకు 2 మిలియన్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. దీంతో వారి ఆర్థిక వనరులపై దెబ్బ కొడితే వారే దిగివచ్చే అవకాశముందని అమెరికా భావిస్తోంది.