: పాపను పాతేసి... తప్పిపోయిందని ఫిర్యాదు
స్వార్థం ఎంత ఘోరానికైనా పురిగొల్పుతుందనడానికి నిదర్శనమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అరాచకాల ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో 6 ఏళ్ల పాపాయిని సజీవంగా పాతిపెట్టింది బాలిక సవతి తల్లి అర్చన (22). తరువాత ఏమీ ఎరుగని దానిలా పాప కన్పించడం లేదంటూ భర్తకు ఫిర్యాదు చేసింది. దీంతో ఏం చేయాలో తోచని అతను వెతికి వెతికి మౌనంగా ఉండగా, అర్చన తను చేసిన ఘోరాన్ని బంధువుల్లో ఒకరికి తెలిపింది. వారు పోలీసులకు సమాచారమందించడంతో దారుణం వెలుగు చూసింది. అర్చన భర్త ఏ ఆలయంలో అర్చకత్వం చేస్తున్నాడో, అదే ప్రాంగణంలో అర్చన బాలికను సజీవ సమాధి చేసింది. తన ఏడాదిన్నర కుమారుడి భవిష్యత్ కోసం సవతి కుమార్తెను పాతిపెట్టానని అర్చన పోలీసులకు వాంగ్మూలమిచ్చింది.