: 'మామ్' పని మొదలుబెట్టింది... భూమికి చేరిన తొలి ఇమేజ్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఇస్రో' ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) పని ప్రారంభించింది. అంగారక గ్రహ కక్ష్యలోకి బుధవారం నాడు విజయవంతంగా ప్రవేశించిన మామ్, తొలి ఇమేజిని పంపింది. అరుణ గ్రహ ఉపరితలాన్ని ఫొటో తీసి కంట్రోల్ సెంటర్ కు పంపింది. ఆ ఫొటోను ఇస్రో వర్గాలు మామ్ ట్విట్టర్ అకౌంట్లో ఉంచాయి. దాని కింద 'ద వ్యూ ఈజ్ నైస్ అప్ హియర్' (ఇక్కడి నుంచి చూస్తే మార్స్ ఎంతో బాగుంది) అన్న క్యాప్షన్ కూడా ఉంది.