: తెలుగులోనే మాట్లాడాలి... తెలంగాణ యాసలో మాట్లాడితే సంతోషం: కేసీఆర్


తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న అధికారులందరూ స్వచ్ఛమైన తెలుగులోనే మాట్లాడాలి... తెలంగాణ యాసలో మాట్లాడితే మరింత సంతోషిస్తానని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాదులో మైనర్ ఇరిగేషన్ శాఖ సమీక్షలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరిగేషన్ శాఖకు పూర్వ వైభవం తీసుకు రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ప్రతి ఏడాది 9,060 చెరువులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. వాటర్ షెడ్ వ్యవస్థను కాకతీయ రాజులే పటిష్ఠం చేశారని కేసీఆర్ తెలిపారు. 1956 కాలంలో తెలంగాణలో 20 లక్షల ఎకరాలకు నీరు అందేదని చెప్పారు. మైనర్ ఇరిగేషన్ కిందే 15 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని... అలాంటిది కుట్రతో మైనర్ ఇరిగేషన్ వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News