: మహారాష్ట్రలో ముగిసిన బీజేపీ-శివసేన పొత్తు?


ఇరవైఐదు సంవత్సరాలుగా మహారాష్ట్రలో కొనసాగుతున్న బీజేపీ-శివసేన పొత్తు నేటితో ముగిసినట్లు సమాచారం. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై కొన్ని రోజుల నుంచీ ప్రతిష్ఠంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వచ్చిన సమస్యలు, ముఖ్యమంత్రి పదవి తమకే కావాలని శివసేన డిమాండ్ చేయడం, అమిత్ షా ముంబయి పర్యటనను రద్దు చేసుకోవడం... ఇవన్నీ పొత్తు విచ్ఛిన్నమైనట్లు చెప్పడానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. ఈ మేరకు మహారాష్ట్ర టీవీ ఛానళ్లలో బీజేపీ-శివసేన పొత్తు ముగిసిందంటూ వార్తలు వస్తున్నాయి. అధికారికంగా పొత్తుకు సంబంధించి ఈ సాయంత్రం ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.

  • Loading...

More Telugu News