: చానల్ బ్యాన్ పై హైకోర్టుకు ఏబీఎన్
తెలంగాణ రాష్ట్రంలో తమ చానల్ ప్రసారాల నిలిపివేతపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించింది. ప్రసారాలను తిరిగి పునరుద్ధరించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను చానల్ సవాల్ చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం వెంటనే పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. అయితే, దసరా పండుగ తర్వాత విచారణ జరుగుతుందని కోర్టు తెలిపింది.