: మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటు


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షమైన ఎన్సీపీతో సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకుంది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 15న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో 118 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేలా ఒప్పందం కుదిరింది. దీంతో, గత రాత్రి తమ అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ ప్రకటించింది. మిగిలిన స్థానాల్లో ఎన్సీపీతో పాటు ఇతర కూటములు పోటీ చేయనున్నాయి. గత 15 ఏళ్లుగా కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసే ఎన్నికల బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News