: కూల్ డ్రింక్స్ తగ్గించండి... పళ్ల రసాలు తాగండి: మోడీ


కూల్ డ్రింక్స్ తాగడం తగ్గించి పండ్ల రసాలను తాగితే రైతులను ఆదుకున్నవారవుతారని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కర్ణాటకలోని తుమ్కూర్ లో ఫుడ్ పార్క్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోకో కోలా, పెప్సీ లాంటి బహుళజాతి కంపెనీలు తమ శీతల పానీయాల ఉత్పత్తులతో పాటు, పండ్ల రసాల ఉత్పత్తికి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. భారతీయ రైతుల నుంచి పండ్లను కొనుగోలు చేయడం ద్వారా రైతుల అభివృద్ధికి దోహదపడిన వారవుతారని ఆయన సూచించారు. శీతల పానియాల కంపెనీలు కోట్లలో వ్యాపారం చేస్తుండగా, పండ్ల వ్యాపారం బాగా జరగడం లేదని ఆయన తెలిపారు. పండ్లు తినడం వల్ల, పండ్ల రసాలు తాగడం వల్ల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు, రైతాంగాభివృద్ధి కూడా జరుగుతుందని ప్రజలు గుర్తించాలని మోడీ సూచించారు.

  • Loading...

More Telugu News