: కారు దొరికింది... హంతకులు తెలివి ప్రదర్శించారు


కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద అవుటుపల్లి వద్ద ఈ ఉదయం జరిగిన కాల్పుల్లో హంతకులు వాడిన కారును పోలీసులు గుర్తించారు. హనుమాన్ జంక్షన్ లోని రాయల్ హంపి హోటల్ వెనుక పార్క్ చేసి ఉన్న కారును గుర్తించిన పోలీసులు కారుపై కూపీ లాగారు. దీంతో హంతకులు గత మూడు రోజులుగా రాయల్ హంపీ హోటల్లో బస చేసినట్టు తెలిసింది. హంతకులు మహేంద్ర ఎస్ యూవీ కారుకు పల్సర్ బైక్ నంబర్ ప్లేటును అమర్చి కాల్పులకు పాల్పడ్డారు. హత్యకు పాల్పడిన అనంతరం హనుమాన్ జంక్షన్ లోని హోటల్ వెనుక కారును వదిలి పరారయ్యారు. దీనిపై కృష్ణా జిల్లా డీఎస్పీ విచారణ జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News