: చెన్నై జూలో మూడంచెల రక్షణ వ్యవస్థ... 'ఢిల్లీ' ఎఫెక్ట్!


ఢిల్లీ జూలో మంగళవారం ఓ యువకుడిని తెల్లపులి బలిగొన్న నేపథ్యంలో, చెన్నై జూ పార్కులో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు మూడంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కందకం-ఫెన్సింగ్-రెయిలింగ్స్... ఇలా, మూడంచెల వ్యవస్థ ఆవల నుంచి, జంతువుల ఎన్ క్లోజర్ ను సందర్శకులు అత్యంత సురక్షిత రీతిలో వీక్షించవచ్చని, తద్వారా జంతువులు దాడి చేసే అవకాశాలు ఉండవని జూ వర్గాలు అంటున్నాయి. ఈ వ్యవస్థలోని చెయిన్ లింక్డ్ ఫెన్సింగ్ మనుషులకంటే ఎక్కువ ఎత్తులో ఉంటుందట. జూ డైరక్టర్ కేఎస్ఎస్వీపీ రెడ్డి మాట్లాడుతూ, సింహాల ఎన్ క్లోజర్ వద్ద కూడా పటిష్ట ఏర్పాట్లు చేస్తామని, సందర్శకులు నిర్దేశిత ప్రాంతం నుంచే సింహాలను వీక్షించాల్సి ఉంటుందని తెలిపారు. కాగా, ఢిల్లీ జూలో తెల్లపులి యువకుడిని చంపిన ఘటనపై చెన్నై జూ పశువైద్యులు మాట్లాడుతూ, అలాంటి సమయాల్లో మత్తు ఇంజెక్షన్లు ఇవ్వడం కంటే, బాణసంచా పేల్చడం ద్వారా జంతువులను పారదోలవచ్చని సూచించారు. మత్తు ఇంజెక్షన్ షూట్ చేసినా, ఆ జంతువుపై అది ప్రభావం చూపేసరికి నష్టం జరిగిపోతుందని వారు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News