: తమ పార్టీ ఎంపీపై విమర్శలు వస్తే వైఎస్సార్సీపీ ఖండించదా?: ఎంపీ గీత ప్రశ్నాస్త్రం
తమ పార్టీకి చెందిన ఎంపీపై సోషల్ మీడియాలో, మీడియాలో ఆరోపణలు వస్తుంటే వైఎస్సార్సీపీ ఎందుకు స్పందించడం లేదని ఎంపీ కొత్తపల్లి గీత ప్రశ్నించారు. విశాఖపట్టణంలో ఆమె మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ నుంచి తనను సస్పెండ్ చేసే ధైర్యం లేక, ఆ పార్టీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. వైఎస్సార్సీపీలో మహిళల పట్ల తీవ్ర వివక్ష ఉందని ఆమె ఆరోపించారు. భవిష్యత్తులో వైఎస్సార్సీపీలో మహిళలంతా బయటకు వస్తారని ఆమె చెప్పారు. బాక్సైట్ తవ్వకాల అనుమతులు తీసుకున్న ఆన్ రాక్ సంస్థ ఎవరిదో అందరికీ తెలిసిందేనని ఆమె తెలిపారు. తానింత వరకు ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదని ఆమె అన్నారు. 5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన తనకు నాలుగు సంతకాలు ఫోర్జరీ చేయాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు. తాను ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చానే తప్ప వ్యక్తుల సేవకు కాదని ఆమె స్పష్టం చేశారు.