: గాలి జనార్ధన్ రెడ్డి 'బెయిల్ డీల్' కేసులో నిందితుడికి బెయిల్


గాలి జనార్ధన్ రెడ్డి 'బెయిల్ డీల్' కేసులో నిందితుడిగా ఉన్న రౌడీ షీటర్ యాదగిరికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే సమయంలో, ఏసీబీ కోర్టుకు ఆరు వారాల్లోగా ప్రత్యేక జడ్జిని నియమించాలని ఉమ్మడి హైకోర్టును ఆదేశించింది. కేసు విచారణను సంవత్సరంలోగా పూర్తి చేయాలని సుప్రీం స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఆరువారాలకు వాయిదా వేసింది. గతంలో ఇదే కేసులో గాలి, పట్టాభిరామారావు, సోమశేఖర్ రెడ్డి సహా ఆరుగురికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అప్పటి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

  • Loading...

More Telugu News