: ఇస్రోకు నాసా అభినందనలు
మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ను అంగారక గ్రహ వాతావరణంలోకి విజయవంతంగా ప్రవేశపెట్టి, చరిత్ర సృష్టించిన ఇస్రోకు అమెరికాలోని నాసా సంస్థ అభినందనలు తెలిపింది. ఈ మేరకు "మార్స్ ను చేరుకున్నందుకు ఇస్రోకు శుభాకాంక్షలు చెబుతున్నాము. అరుణగ్రహంపై అధ్యయనం చేసేందుకు మార్స్ ఆర్బిటర్ చేరింది" అని ట్విట్టర్ లో తెలిపింది. కాగా, నాసా ప్రవేశపెట్టిన 'మావెన్' నిన్ననే (మంగళవారం) అంగారక కక్ష్యలోకి చేరుకుంది.