: 'విజయదశమి' రోజున రేడియో ద్వారా మోడీ ప్రసంగం


ప్రధానమంత్రి నరేంద్రమోడీ అక్టోబర్ 3న రేడియోలో ఓ కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. ఆ రోజు విజయదశమి పండుగ కావడంతో పలు విషయాలపై ప్రసంగిస్తారు. ఈ మేరకు "రాబోయే నా రేడియో కార్యక్రమం కోసం పలు సూచనలు, సలహాలు స్వీకరించాను. అందుకే అక్టోబర్ 3వ తేదీన ఉదయం 11 గంటలకు తొలి రేడియో ప్రోగ్రామ్ నిర్వహించనున్నాం" అని మోడీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అంతేగాక ఆ రోజు తనలోని కొన్ని ఆలోచనలు అందరితో పంచుకుంటానని కూడా చెప్పారు. అదే సమయంలో పలు విభిన్న అంశాలపై ప్రధాని మాట్లాడతారని, పలువురితో ఏర్పాటు చేసే ఓ డిబేట్ కార్యక్రమంలో ప్రభుత్వ పని తీరు, ఇతర విషయాలపై కూడా అడుగుతారని ప్రభుత్వం ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఈ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా రేడియో ప్రసారం చేయనుందని సమాచారం.

  • Loading...

More Telugu News