: ఇస్రో కంట్రోల్ రూంలో మోడీ... ప్రయోగాన్ని దగ్గరుండి పరిశీలిస్తున్న ప్రధాని
అరుణ గ్రహ కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ మరికొద్ది నిమిషాల్లో చేరుకోనుంది. దీన్ని ప్రత్యక్షంగా చూడటానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇస్రో కంట్రోల్ రూంలో మోడీ దగ్గరుండి మరీ ఈ ప్రయోగాన్ని పరిశీలిస్తున్నారు. మామ్ ను అంగారక కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియను నరేంద్రమోడీ వీక్షిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా మోడీతో పాటు ఇస్రో కేంద్రానికి చేరుకున్నారు.