: చరిత్ర సృష్టికి చేరువలో భారత్... ఉదయం 7.17 గంటలకు మార్స్ కక్ష్యలోకి 'మామ్'
అంతరిక్ష రంగంలో చారిత్రక విజయం అంచున భారత్ నిలబడింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అంగారక గ్రహంపైకి ఇస్రో పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మంగళయాన్) ఉపగ్రహం కాసేపట్లో మార్స్ కక్ష్యలోకి ప్రవేశించనుంది. ఉదయం 7.17.32 గంటలకు అంగారక కక్ష్యలోకి మామ్ ప్రవేశిస్తుంది. అనంతరం 8.15 గంటలకు భూమికి సమాచారాన్ని పంపిస్తుంది. మధ్యాహ్నానికి అంగారకుడి ఉపగ్రహానికి సంబంధించిన కలర్ ఫొటోలను భూమికి పంపిస్తుంది.