: దేశంలో నిరుద్యోగుల సంఖ్య 11.3 కోట్లు!


ఉద్యోగం లభించక, నిరుద్యోగులుగా కాలం వెళ్లదీస్తున్న వారు దేశంలో 11.3 కోట్ల మంది ఉన్నారట. 2011 జనాభా లెక్కల ప్రకారం వీరందరూ దేశవ్యాప్తంగా ఉన్న 7 కోట్ల కుటుంబాలకు చెందిన వారుగా తేలారు. 15-60 ఏళ్ల మధ్య వయస్కుల్లో వీరు 15 శాతమని జాతీయ జన గణన విభాగం లెక్క తేల్చింది. ఇలా నిరుద్యోగులున్న కుటుంబాలు 2001లో 23 శాతం ఉంటే, పదేళ్లు తిరిగేసరికి ఈ కుటుంబాల శాతం 28కి పెరిగింది. గడచిన మూడేళ్లుగా ఎలాంటి ఉద్యోగ భర్తీ చేపట్టని నేపథ్యంలో పరిస్థితి మరింత విషమంగా మారింది. ఇక పెద్ద సంఖ్యలో నిరుద్యోగులను కలిగిన రాష్ట్రాల్లో పశ్చమ బెంగాల్ మొదటి స్థానంలో ఉండగా, తక్కువ మంది నిరుద్యోగులున్న రాష్ట్రాల్లో గుజరాత్ ప్రథమ స్థానంలో నిలిచింది. గుజరాత్ తో 12 శాతం మంది నిరుద్యోగులుంటే, ఆంధ్రప్రదేశ్ 18 శాతం మంది నిరుద్యోగులున్నట్లు జనాభా లెక్కలు తేల్చాయి.

  • Loading...

More Telugu News