: ఈ నెల 26న మోడీ అమెరికా వెళ్తారు: పీఎంవో


ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన అధికారికంగా ఖరారైంది. సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు ప్రధాని అమెరికాలో పర్యటిస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది. ఈ పర్యటనలో ప్రధాని అమెరికాకు చెందిన ఆరు కంపెనీల సీఈవోలతో సమావేశమవుతారని పీఎంవో తెలిపింది. ఈ నెల 27న ఐక్య రాజ్యసమితిలో సర్వసభ్య సమావేశంలో మోడీ హిందీలో ప్రసంగిస్తారని పీఎంవో వివరించింది. సెప్టెంబర్ 29, 30 తేదీలలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాలో భేటీ కానున్నారని పీఎంవో వెల్లడించింది.

  • Loading...

More Telugu News