: కేసీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కోర్టులు తప్పుబట్టాయి: నర్సిరెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా న్యాయస్థానాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయని టీడీపీ అధికారి ప్రతినిధి నర్సిరెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, అధికారం చేతిలో ఉంది కదా అని కేసీఆర్ తప్పులమీద తప్పులు చేస్తున్నాడని అన్నారు. అధికారం చేపట్టి మూడు నెలలు ముగిసినా పథకాలు చేపట్టని ప్రభుత్వం టీఆర్ఎస్ దేనని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సరైన నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రజాదరణను పెంచుకోవడమే తప్ప కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్ తీరుతో తెలంగాణ రాష్ట్రం పరువు ప్రతిష్ఠలు మంటగలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.