: తిరుపతిలో ఇంజినీరింగ్ కాలేజీకి బాంబు బెదిరింపు
తిరుపతిలో బాంబు కలకలం రేగింది. మంగళం రోడ్డులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీకి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో అక్కడ ఆందోళన నెలకొంది. క్యాంపస్ లో బాంబు ఉందంటూ ఓ వ్యక్తి కాలేజీ యాజమాన్యానికి ఫోన్ చేశాడు. దీంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం అక్కడ బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది.