: ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలో విద్యార్థిని చంపేసిన తెల్లపులి
ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలో విషాదం చోటు చేసుకుంది. 12వ తరగతి చదవుతున్న ఓ విద్యార్థిని జూలోని తెల్ల పులి చంపేసింది. విద్యార్ధి కంచెలోకి తొంగి చూస్తుండగా పులి అతడిని లోపలికి లాగేసిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. పులుల ఎన్ క్లోజర్ కంచె తక్కువ ఎత్తులో ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నాడు. ఈ ఘటన ఈ మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో జరిగిందని, చాలా బిగ్గరగా కేకలు వేయడం తాము విన్నామని హిమాన్షు అనే ఓ సందర్శకుడు తెలిపాడు. అప్పుడే కొంతమంది పిల్లలు పులిపై చిన్న కర్రలు, రాళ్లు వేయడం చూశామన్నాడు. మరోవైపు, బోనులో పులి ఆ విద్యార్థి మెడను నోటకరవడం చూశామని, అప్పుడు బాలుడు బాగా నొప్పితో ఇబ్బంది పడ్డాడని వివరించాడు. దాదాపు పదిహేను నిమిషాల పాటు అతను బాధపడ్డాడని, కానీ చివరికి ఎవరూ సాయం చేయలేదనీ అన్నాడు.