: అమెరికా కక్షగడితే అంతే!


అమెరికా ఏదయినా దేశంపై కక్షగట్టిందా, ఆరు నూరైనా, నూరు ఆరైనా సరే దానిపై దాడులు జరిగి తీరాల్సిందే. ఇంధన వనరులు ఇవ్వనన్న ఇరాక్ పై అణుబాంబులు తయారు చేస్తోందనే నెపంతో యుద్ధానికి దిగింది. పాక్ గడ్డపై క్షణాల్లో అడుగుపెట్టి, ట్విన్ టవర్స్ ను కూల్చేసిన ఆల్ ఖైదా నేత ఒసామాబిన్ లాడెన్ ను మెరుపువేగంతో మట్టుబెట్టింది. తాజాగా, తననే సవాలు చేస్తున్న ఒకనాటి తన పెంపుడు కుక్క ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) గ్రూపుపై దాడులను తీవ్రం చేసింది. సిరియాలో విరివిగా లభించే ఇంధనంపై కన్నేసిన అమెరికా నాయకత్వాలు, అక్కడి ప్రభుత్వం తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేలా చేసేందుకు గాను అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషించాయి. అమెరికా సరఫరా చేసిన నిధులు, ఆయుధాలతోనే ఇప్పుడు ఇరాక్, సిరియాలో ఐఎస్ఐఎస్ దాడులు జరుగుతున్నాయి. ఈ ఆయుధాలు అమెరికా నుంచి సిరియా, సిరియా నుంచి ఇరాక్ కు పంపిణీ అయ్యాయి. ఐఎస్ఐఎస్ కు అన్ని విధాలా బలం చేకూరగానే ఆమెరికాపై దాడులకు సిద్ధమైంది. దీంతో, తాను పెంచిన ఉగ్రవాదమే తనను కాటేస్తాననడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఆమెరికా ఐఎస్ఐఎస్ పై ఇరాక్, సిరియాల్లో దాడులకు దిగింది. ఇరాక్ పై ఈ నెల 16న వైమానిక దాడులు ప్రారంభించిన అమెరికా, ఈ ఉదయం సిరియాలోని ఐఎస్ఐఎస్ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. వైమానిక దాడులకు తోడు, సముద్రంలోని నౌకల ద్వారా కూడా ఆమెరికా క్షిపణి దాడులు చేస్తోంది. ఇరాక్, సిరియాల్లో ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల కార్యకలాపాలు అంతం చేసే దిశగా దాడులు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News