: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త... ఉద్యోగ నియామకాల వయో పరిమితి పెంపు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం నుంచి శుభవార్త అందింది. ఉద్యోగ నియామకాల్లో ఓసీ అభ్యర్థుల వయోపరిమితిని 34 సంవత్సరాల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కొద్దిసేపటి కిందట ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఇందులో ప్రధానంగా, ఏపీపీఎస్సీ నియామకాలతో పాటు డీఎస్సీ నియామకాలకు కూడా ఈ పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉత్తర్వుల్లో వెల్లడించింది. రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో యువత ఇప్పటికే పలు విభాగాల్లో ఉద్యోగ అవకాశాలను కోల్పోవడంతో వారికి అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతోనే నిరుద్యోగుల వయో పరిమితిని ఆరేళ్లు పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దాంతో, ఇక నుంచి ఏ ఉద్యోగ ప్రకటన వచ్చినా ఓసీలకు ఈ పరిమితి వర్తిస్తుందని తెలిపింది. అలాగే ఎస్టీ, ఎస్సీలకు ఇప్పటికే ఉన్న వయో పరిమతి సడలింపును అలాగే కొనసాగించనున్నారు.

  • Loading...

More Telugu News